తమ్ముడా పవన్..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గద్దర్ చివరి మాటలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఇంస్టాగ్రామ్‌లో గద్దర్ తన గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడం జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఇంస్టాగ్రామ్‌లో గద్దర్ తన గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. తమ్ముడా పవన్..! అనే టైటిల్ కలిగిన ఈ వీడియోలో పవన్ కళ్యాణ్‌ని పొగుడుతూ దేశం యువతతో నిండి ఉందని గద్దర్ పాట రూపంలో తెలియజేశారు. ''ఈ యువతరానికి నాయకుడు కావాలి. తమ్ముడు పవన్ కాలం గొప్పది. దానికి రుచి వాసన ఉండదు దానితో కలిసిపోవాలి. రాజకీయాలలో తెగింపు ఉండాలి''.. అంటూ పవన్ కళ్యాణ్‌కి పలు సూచనలు తెలియజేస్తూ గద్దర్ పాటను ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గద్దర్‌తో అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్‌కి గద్దర్ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని చాలా రాజకీయ, సినిమా వేదికలపై కూడా తెలియజేయడం జరిగింది. గద్దర్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే పవన్. ఆయన అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉన్న సమయంలో పరామర్శించడం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయన మరణించడంతో గద్దర్ భౌతికకాయం వద్ద పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తనతో మాట్లాడిన చివరి పాటల వీడియో పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.