‘దొందూదొందే’.. తెలంగాణ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీ తప్ప

Update: 2024-07-25 15:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీ తప్ప తెలంగాణ బడ్జెట్‌లో ఏమీలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ఫైర్ అయ్యారు. రైతు భరోసాకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని, బడ్జెట్‌లో దళిత నిధులను రూ.21,072 కోట్ల నుంచి రూ.7,638 కోట్లకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజన నిధులను రూ.4,365 కోట్ల నుంచి రూ.3,969 కోట్లకు తగ్గించారని, కానీ మైనారిటీ నిధులను మాత్రం రూ.3,003 కోట్లకు పెంచారన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందేనని సెటైర్ వేశారు. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,91,059 కోట్ల వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలో స్టేట్ బడ్జెట్‌పై కిషన్ రెడ్డి పై విధంగా రియాక్ట్ అయ్యారు. 


Similar News