Y. S. Sharmila అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన YSRTP అధ్యక్షురాలు YS షర్మిలను అడ్డుకుని అరెస్టు చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

Update: 2022-11-29 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన YSRTP అధ్యక్షురాలు YS షర్మిలను అడ్డుకుని అరెస్టు చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఒక మహిళపట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైనది! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల తన వాహనంలో ఉండగానే వాహనాన్ని క్రేన్‌తో లాక్కెళ్లిన హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

2024లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా?: Kishan రెడ్డి

కారులోనే YS షర్మిల.. క్రేన్ తో పోలీసులు ఎలా తీసుకెళ్తున్నారో చూడండి

Tags:    

Similar News