Kishan Reddy: సీఎం రేవంత్ ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు
సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) కాదు.. ఆయన ఇక్కడి నుంచి పంపిన డబ్బు కూడా మహారాష్ట్రలో పనిచేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) కాదు.. ఆయన ఇక్కడి నుంచి పంపిన డబ్బు కూడా మహారాష్ట్రలో పనిచేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఎన్డీయే(NDA) కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయమని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసిందని.. అయినా పనిచేయలేదని విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ(BJP) వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందిందని.. కానీ ఈసారి అసలు ద్రోహులు ఎవరో ప్రజలు గుర్తించారని అన్నారు.
రాహుల్ గాంధీకి మతిమరుపు ఎక్కువైందని.. ఆయన గురివింద గింజ కామెంట్లను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పనితీరు నచ్చి ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే చాలా నవ్వొస్తోందని అన్నారు. అధికారంలోకి రాకముందే నాలుగు విమానాలను కాంగ్రెస్ రెడీ చేసుకుందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కావాల్సిన భోజనం కూడా సిద్ధం చేశారని అన్నారు. శివసేన వర్గం మొత్తం మోడీ పక్కన చేరింది.
మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదు.. బాల్ ఠాక్రే స్ఫూర్తిని చూశారని అన్నారు. 102 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తే 15 నుంచి 18 సీట్లలో మాత్రమే ప్రభావం చూపించింది. జార్ఖండ్‌లో కూడా అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయిందని తెలిపారు. సంజయ్ రౌత్ అనే పనికిరాని నాయకుడు. ఈవీఎంలను మేనేజ్ చేశారని మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో ఎందుకు ఇలా జరగదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.