‘ఈటల రాజేందర్ బీజేపీకి కొత్త కాదు’.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీలో గత కొంత కాలంగా కొత్త-పాత నేతల వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొత్త-పాత ఇష్యూపై బీజేపీ కీలక నేత, కేంద్ర

Update: 2024-07-12 13:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీలో గత కొంత కాలంగా కొత్త-పాత నేతల వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొత్త-పాత ఇష్యూపై బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో జరిగిన టీ-బీజేపీ రాస్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి చీఫ్ గెస్ట్‌గా ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీకి కొత్త కాదని.. బీజేపీలో చేరిన నేతలంతా పాతవారేనని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ కూడా బీజేపీలో పాత నేత అయిపోయాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక, బీజేపీ ఉత్తరాది పార్టీ మాత్రమే అనేవారని.. కానీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కూడా బీజేపీ సత్తా చాటిందన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్‌గా మార్చేందుకు మా దగ్గర 1500 రోజుల ప్రణాళి ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భవిష్యత్‌లో తెలంగాణలో నంబర్‌వన్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ పాత కొత్త వార్‌పై మాట్లాడటంతో ఇక ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడినట్లేనని కాషాయ వర్గా్ల్లో ప్రచారం జరుగుతోంది. 


Similar News