Good News: పండగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణకు రూ.3,745, ఏపీకి రూ.7,211 కోట్లు
పండగ వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీపికబురు అందించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పండగ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రాలకు అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన పన్నుల వాటా రూ1,78,173 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ పన్నుల వాటా కాకుండా ఈసారీ పండగలు, రాష్ట్రాల అభివృద్ధి, మూలధన వ్యయానికి ఊతమిచ్చేలా అదనంగా ఒక నెల అడ్వాన్స్ చెల్లింపల కింద మరో రూ.89,086.50 కోట్లు రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు 3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 7,211 కోట్లు చెల్లించింది. అత్యధికంగా యూపీకి రూ. 31,962 కోట్లు దక్కనుండగా బిహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, పశ్చిమబెంగాల్ కు రూ. 13,404, మహారాష్ట్రకు రూ.11,255, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లను విడుదల చేసింది.