Union Budget 2024 : కేంద్రబడ్జెట్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

2024-25 వార్షిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో కేంద్రం నిరద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-07-23 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 వార్షిక సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో కేంద్రం నిరద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సహకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌ల కోసం మూడు పథకాలను అనౌన్స్ చేసింది. కొత్త ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ చెల్లింపుల్లో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. తొలిసారి సంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. గరిష్టంగా రూ.15వేలు చెల్లించనున్నట్లు పేర్కొంది. నెలకు గరిష్టంగా రూ.లక్ష లోపు వేతనం ఉన్న వారు అర్హులు అని క్లారిటీ ఇచ్చింది. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News