KCR సభలో కలకలం.. నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం
దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి సభలో ఓ నిరుద్యోగి కలకలం రేపాడు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.
దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి సభలో ఓ నిరుద్యోగి కలకలం రేపాడు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేందానికి చెందిన పెరుమాండ్ర రమేష్‌గా గుర్తించారు. అతని వద్ద లభ్యమైన వినతి పత్ర ఆధారంగా అందిన సమాచారం మేరకు... బాధితుని తండ్రి పెరుమాండ్ల మల్లయ్య కళాకారునిగా జీవించేవాడు. వయోభారంతో ఇటీవలే మృత్యువాత పడడంతో రమేష్ తల్లి కూడా పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితం అయింది. బీఈడీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో కుటుంబాన్ని పోషించే స్థోమత లేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు రమేష్ వివరించాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆ వినతి పత్రంలో కోరాడు. అయితే, సీఎం సభావేదిక వద్దకు వచ్చిన రమేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని నిలువరించారు. ఈ సంఘటనను మొబైల్‌లో వీడియో తీస్తున్న వారి సెల్ ఫోన్లను పోలీసు అధికారులకు లాక్కున్నారు.