ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర.. నిరుద్యోగులంతా హైదరాబాద్ వైపు..

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2022-03-09 07:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. గత మూడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉపశమనం లభించింది. త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ గత ఏడాదిగా కేసీఆర్ సర్కార్ చెప్పుకొస్తోంది. దీంతో ఉద్యోగాలపై మరింత ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు.. హామీ నెరవేర్చకపోవడంతో పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఇప్పటికే పలుమార్లు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు చెల్లిస్తూ నగరంలో హాస్టల్లో ఉంటున్న నిరుద్యోగులకు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నూతన జోనల్ ద్వారా ఉద్యోగులను భర్తీ చేసి అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించారు. ఈ క్రమంలో కొత్తగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగులంతా ఈ సారి ఎలా అయినా ఉద్యోగాలు సాధించాలన్న దృఢ సంకల్పంతో మళ్లీ కోచింగ్ సెంటర్లలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఒక్కసారిగా ఇన్ని వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో భారీగా నిరుద్యోగ యువత నగరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇటు కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు తెరుచుకునేందుకు సిద్ధమయ్యాయి. బుధవారం నుంచే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నందున కోచింగ్ సెంటర్లకు ఇప్పటికే ఫోన్‌లు చేసి అడ్మిషన్ చేసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఆ విద్యార్థులు కూడా భౌతిక తరగతులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News