Telangana: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..
జమాయిల్ కర్రల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బస్టాండ్ సమీపంలోని మూలమలుపు వద్ద చోటుచేసుకుంది.
దిశ, గూడూరు: జమాయిల్ కర్రల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బస్టాండ్ సమీపంలోని మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. మహబూబాబాద్ నుండి వరంగల్‌కు వెళ్తున్న లారీ... గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చుంచా దేవేందర్, మండలంలోని కొంగర గిద్ద గ్రామానికి చెందిన ధనసరి పాపారావు పోలీస్ విధులు నిర్వహిస్తున్నారు.
వీరిద్దరూ ఉదయం బస్సు కోసం బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో వేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందారు. కాగా మృతుడు దేవేందర్ ములుగు జిల్లా రాయినిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పాపారావు గూడూరు సిఐ గన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
రోజు లాగానే విధులకు హాజరవుతుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మహబూబాబాద్ ఎస్పీ రామ్ నాథ్ కేకన్ సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు.