ఎన్నికల ఎఫెక్ట్.. సంక్రాంతి రికార్డ్ బద్దలు కొట్టిన TSRTC

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Update: 2024-05-12 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత ఊర్లుకు ప్రయాణమయ్యారు. బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎన్నికల వేళ ప్రయాణికుల తాకిడితో టీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి పండుగ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతి కన్నా 10 శాతం పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆర్టీస్ బస్సుల్లో 1.42 లక్షల మంది ప్రయాణించగా.. ఇందులో ఏపీకి 59,800 మంది జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌కు మరింత కొంత సమయం ఉండటంతో ఇవాళ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల లోక్ సభ పరిధిలో నివాసం ఉండే సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కను వినియోగించుకునేందుకు ఏపీకి బయలుదేరారు. 


Similar News