TSPSC లీకేజీ కేసు : నేడు హైకోర్టుకు సిట్ నివేదిక
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్అధికారులు మంగళవారం హైకోర్టుకు సీల్డ్కవర్లో నివేదికను సమర్పించనున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్అధికారులు మంగళవారం హైకోర్టుకు సీల్డ్కవర్లో నివేదికను సమర్పించనున్నారు. నివేదికలో ఏయే అంశాలు ఉన్నాయనేది సస్పెన్స్‌గా మారింది. టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వహించిన బిల్డింగ్టౌన్ప్లానింగ్ఓవర్సీస్పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్టుగా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో బోర్డు అసిస్టెంట్సెక్రటరీ సత్యనారాయణ బేగంబజార్పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తేనెతుట్టె కదిపినట్లైంది.
సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్అధికారులు, బేగంబజార్పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఏఈఈ సివిల్, జనరల్స్టడీస్కు చెందిన ప్రశ్నపత్రాలు లీకైనట్లు స్పష్టమైంది. అసిస్టెంట్సెక్రటరీ హోదాలో బోర్డు కార్యదర్శి అనితా రాంచంద్రన్వద్ద సెక్రటరీగా పనిచేస్తున్న ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఈ ప్రశ్నపత్రాలను అపహరించినట్టు తేలింది. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా గ్రూప్-1 ప్రిలిమ్స్ప్రశ్నపత్రాన్ని కాజేసినట్లు నిందితులు వెల్లడించారు.
బోర్డులోని కాన్ఫిడెన్షియల్రూం ఇన్చార్జిగా పని చేస్తున్న శంకర్లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్లకు సంబంధించిన పాస్వర్డులు, ఐపీ అడ్రసులు చోరీ చేసిన ప్రవీణ్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చాడు. వాటి సహాయంతో ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు అపహరించారు. ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్పేపర్లను తనకు మూడేళ్లుగా పరిచయం ఉన్న గురుకుల టీచర్రేణుకకు అమ్మాడు. ఈ క్రమంలో పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వాటిని తన భర్త డాక్యానాయక్‌కు ఇచ్చినట్లు చెప్పింది. ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జి ప్రశ్నపత్రాలను అమ్మిన రేణుక, డాక్యానాయక్ అతని బావమరిది రాజేశ్వర్‌నాయక్, తిరుపతయ్యతోపాటు వీటిని కొన్న ఏడుగురిని అరెస్టు చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ప్రశ్నపత్రానికి సంబంధించి సిట్అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, షమీమ్, రమేశ్, సురేశ్ఉన్నారు. వీరితోపాటు న్యూజిలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినట్టుగా విచారణలో తెలిసినా ఇంకా నిర్ధారణ కాలేదు. విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులిచ్చినా ప్రశాంత్‌రెడ్డి రాలేదు. వందకు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను విచారించగా వీరిలో ఏ ఒక్కరికి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందలేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఏవో ప్రశ్నపత్రం లీక్ కేసులో లౌకిక్తోపాటు ఆయన భార్య సుస్మితను అరెస్టు చేశారు. ప్రవీణ్ నుంచి రూ.6 లక్షలకు ప్రశ్నపత్రం కొన్నట్లు స్పష్టమైంది. అన్ని వివరాలను పొందుపరుస్తూ తయారు చేసిన నివేదికను సిట్అధికారులు మంగళవారం హైకోర్టుకు సమర్పించనున్నారు.