ఆరోగ్య తెలంగాణకు అడుగులు.. టీఎస్ఎంఎస్​ఐడీసీ చైర్మన్​డా.ఎర్రోళ్ల శ్రీనివాస్

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో ఆరోగ్యం పరుగులు పెడుతోందని టీఎస్ఎంఎస్​ఐడీసీ చైర్మన్​డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.

Update: 2023-06-03 17:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ఆదేశాలతో మంత్రి హరీష్​రావు ఆలోచనలతో ఆరోగ్యరంగం పరుగులు పెడుతున్నదని టీఎస్​ఎంఎస్​ఐడీసీ చైర్మన్​ డాక్టర్​ఎర్రోళ్ల శ్రీనివాస్​కొనియాడారు. మంత్రి హరీష్​ రావు బర్త్​డే సందర్భంగా ఆయన హెల్త్ హెచ్​వోడీలతో కలసి కోఠి క్యాంపస్​ లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్ ​మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిల్లాకో మెడికల్ కాలేజీలతో పేద ప్రజలందరికీ సూపర్​స్పెషాలిటీ వైద్యం అందుతుందన్నారు. కేసీఆర్​కిట్, న్యూట్రిషన్​కిట్, ఎన్​సీడీ కిట్ లతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. పబ్లిక్​హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మంత్రి హరీష్​ రావు నేతృత్వంలో హెల్త్ సెక్టార్ బలోపేతం అయిందన్నారు.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు పనితీరు మెరుగుపడిందన్నారు. పేదోళ్లకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. డీఎంఈ డాక్టర్ రమేష్​ రెడ్డి మాట్లాడుతూ...కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం వలన ఎంబీబీఎస్​ సీట్లు పెరిగాయన్నారు. దీంతో ఎక్కువ మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారన్నారు. తద్వారా వైద్యరంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. టీవీవీపీ కమిషనర్​డాక్టర్​అజయ్​ కుమార్​ మాట్లాడుతూ...జిల్లా, ఏరియా ఆసుపత్రులన్నింటిలో అవసరమైన సదుపాయలన్నీ అతి తక్కువ సమయంలో సమకూర్చుతున్నారన్నారు. దీంతోనే గతంతో పోల్చితే ఫర్మామెన్స్​ లో మార్పు కనిపిస్తుందన్నారు.

టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఎండీ చంద్రశేఖర్​రెడ్డి మాట్లాడుతూ...ఆసుపత్రుల్లో మిషన్లు ఖరాబైన వెంటనే మరమ్మతులు జరిగేందుకు ప్రత్యేక సిస్టంను తీసుకువచ్చామన్నారు. దీంతో పాటు మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ మిషన్లు, ఎక్విప్​మెంట్లను కొనుగోలు చేసి ముఖ్యమైన ప్రభుత్వాసుత్రులన్నింటిలోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్ ఓఎస్డీ శంకర్​, పబ్లిక్​ హెల్త్​ డాక్టర్స్​ అసోసియేషన్​ప్రెసిడెంట్ డాక్టర్​కత్తి జనార్ధన్​, డాక్టర్​రాజ్​కుమార్​జాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News