ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేదుకు వీలుగా బస్ ట్రాకింగ్ వీలు కల్పిస్తూ 'టీఎస్ ఆర్టీసీ గమ్యం' పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేదుకు వీలుగా బస్ ట్రాకింగ్ వీలు కల్పిస్తూ 'టీఎస్ ఆర్టీసీ గమ్యం' పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శనివారం ఉదయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దగ్గర్లోని బస్సు ఎక్కడ ఉంది, సమీపంలోని బస్ స్టాప్ వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే బస్ స్టాప్ అందుబాటులో లేని చోట మహిళల కోసం ప్రత్యేకంగా 'ప్లాగ్ బస్' ఆప్షన్ ను ఈ యాప్ లో ప్రవేశపెట్టారు. ఈ యాప్ లో ఉన్న ప్లాగ్ బస్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రత్యేకమైన కలర్ లోకి మారిపోతుంది. ఈ స్కీన్ ను బస్ డ్రైవర్ కు చూపడం ద్వారా బస్ స్టాప్ లేని చోట కూడా బస్ ను నిలుపుతారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్లాగ్ బస్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.
Read More: ప్రయాణికులకు TSRTC మరో గుడ్ న్యూస్