బండి సంజయ్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులు హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ ను సవాలు వేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టు ఆశ్రయించారు.
దిశ, వెబ్ డెస్క్: టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులు హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ ను సవాలు వేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టు ఆశ్రయించారు. సోమవారం కేసు విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా ఇవాళ జరిగిన విచారణలో బండి సంజయ్ పోలీసులకు సహకరించడం లేదని ఏజీ వాదించారు. బండి సంజయ్ ఫోన్ ఇవ్వడంలేదని ఆరోపించారు. విచారణకు సహకరించనందున ఆయన బెయిల్ ను రద్దు చేయాలని ఏజీ హైకోర్టును కోరారు. దీంతో ఈ విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బండి సంజయ్ రిమాండ్ అక్రమని ఆయన తరఫు లాయర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు.
Also Read..
సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ