TS Elections : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో మంత్రి పోలింగ్ బూత్ కు వెళ్లారు. అలానే ఓటు హక్కు వినియోగించుకుని మీడియాకు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక, అధికారుల ఫిర్యాదు మేరకు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సైతం బీఆర్ఎస్ పార్టీ కండువాతోనే పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.