TG EdCET : తెలంగాణ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత శాతం ఎంతంటే?
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ 2024ఫలితాలు విడుదలయ్యాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ 2024ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మా గాంధీ వర్సిటీ ఇంచార్జి వీసీ నవీన్ మిట్టల్ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో 96.90 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని టీజీ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హాల్‌లో ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. ఆన్ లైన్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో మే 23న పరీక్షను నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎడ్‌సెట్‌కు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. సెషన్ -1లో 16,929 మందికి గానూ 14,633 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సెషన్ -2 లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.