TS: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది.

Update: 2023-03-23 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, వొకేషనల్ రెగ్యులర్, ప్రైవేట్ స్టూడెంట్స్ అధికార వెబ్‌సైట్ https://bse.telangana.gov.in నుంచి స్టూడెంట్స్ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. రాష్ట్రంలో మొత్తం 4,94,616 మంది స్టూడెండ్స్ పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలకు 6 పేపర్లు అన్న విషయం తెలిసిందే. అన్ని పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వగా, సైన్స్ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు.

ఇవి కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు

Tags:    

Similar News