మునుగోడులో ఈవీఎంలు మార్చకపోతే టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా వచ్చేది కాదు : KA Paul
మునుగోడులో ఈవీఎంలు మార్చకపోతే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చేది కాదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మునుగోడులో 36 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవైపు ఉంటే 64 శాతం మంది ప్రజలు నా వైపు ఉన్నారని, మునుగోడులో ఈవీఎంలు మార్చకపోతే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చేది కాదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. సేవ్ తెలంగాణ పేరుతో ఆయన చేపట్టిన యాత్ర నిజామాబాద్‌కు చేరింది. అదివారం జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ కాదని అది బీజేపీకి బి పార్టీ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను తాను చెప్పినట్లు వినని వారిని వేధించేందుకు ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్రకు పర్మిషన్ ఇస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ స్తంభించి పోయినా పట్టించుకోవడం లేదు. కానీ నేను పాదయాత్ర సభలు పెడతానంటే కేసీఆర్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని, మరి వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ప్రజల ముందు ఒక ఛాలెంజ్ ఉందని.. ఆరు నెలల్లో జరగబోయే ఎలెక్షన్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. మత విద్వేశాలు రెచ్చగొడుతున్న బండి సంజయ్ కావాలో లేక ప్రతి తలపై 5 లక్షల అప్పులు చేసిన సీఎం కేసీఆర్ కోడుకు సీఎం కావాలో తెల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేస్తూ అడవి లాంటి హైదరాబాదును చంద్రబాబు, రోశయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హయాంలో వందల కోట్లు తీసుకువచ్చి కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కేఏ పాల్ కావాల్నో నిర్ణయించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నిజంగా బీజీపీతో మోడీతో పోరాడాలంటే నేను జనవరి 30న పెట్టే వరల్డ్ గ్లోబల్ పీస్ ర్యాలీ ఎకనామికల్ సమ్మెట్‌కి 100 మంది బిల్లినియర్స్, మిల్లినియర్స్, ప్రెసిడెంట్‌లను తీసుకువస్తానని, దీనికి పర్మిషన్ ఇవ్వమనండి అన్నారు. గతంలో ప్రపంచ శాంతి సభకు, ఎకనామిక్ సమ్మెటకు గద్దర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అడిగినా పర్మిషన్ ఇవ్వకుండా క్యాన్సల్ ఎందుకు చేశారో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నేను లక్షల ఉద్యోగాలు తెచ్చానని ముఖ్యమంత్రే అన్నారని, మరి నాతో ఎందుకు కలిసి పని చేయడం లేదని ప్రశ్నించారు. నన్ను పిలుస్తే ముఖ్యమంత్రితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ అన్నారు. 50 రోజులలో బూత్ లెవెల్ కార్యకర్తలు ఏర్పాటు చేసుకోవాలి, గ్రామ, మండల కో ఆర్డినేటర్‌లను నియమించు కోవాలన్నారు. నిరుద్యోగులు, రైతులు, తెలంగాణ కోసం పోరాడిన వారు ఆత్మహత్య లు చేసుకోవద్దని, వచ్చే 5 ఏళ్లలో నేను అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కిలారీ ఆనంద్ పాల్ ప్రజలను కోరారు.