విషాదం.. ఇద్దరు కుమారులతో కలిసి తల్లి సూసైడ్

ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది.

Update: 2023-05-09 03:08 GMT

దిశ, సత్తుపల్లి : తల్లి తన ఇద్దరు కుమారులతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. 12 సంవత్సరాల క్రితం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన పాటి బండ్ల మృదుల (40)తో వివాహం అయింది. అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డ ప్రశాంత్ ఏడు సంవత్సరాల క్రితం తిరిగి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్, షేర్ మార్కెట్ వ్యసనాలకు అలవాటు పడి అమెరికాలో ఉండి హైదరాబాదులో సంపాదించిన విలువైన ఆస్తులను క్రమక్రమంగా అమ్ముకుంటూ వచ్చాడు.

హైదరాబాదు నుంచి ఇటీవల 15 రోజుల క్రితం పాటిబండ్ల మృదుల 40 మృదులకి వారి తల్లిదండ్రులు వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన ఏడున్నర ఎకరాల భూమిని ఆమె పేరు మీద రాసిచ్చారు. దీనితో పాటుగా కట్నం కింద ఇచ్చిన ఏడున్నర ఎకరాల భూమిని అమ్ముకుందామని భర్త ప్రశాంత్ భార్య మృదులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన మృదుల పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి విజయవాడకు వెళ్లి అక్కడ కృష్ణా నదిలో దూకే ప్రయత్నం చేసింది.

ఆలోచించి ఇక్కడ చనిపోతే తన శవం దొరకదేమో అని సందేహంతో నిన్న సాయంత్రం సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ తన స్వగృహానికి చేరుకున్న తర్వాత విజయవాడలో ఉన్న తన పిన్నికి ఫోన్ చేసి తాను పిల్లలు విజయవాడ నుంచి సత్తుపల్లికి క్షేమంగా చేరినట్లు సమాచారం చేరవేసింది. సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని టూ వీలర్‌పై సత్తుపల్లి పట్టణ శివారులో ఉన్న తామర చెరువు వద్దకు వెళ్లి టూవీలర్లు చెరువు కట్టపై ఉంచి ఇద్దరు పిల్లల్లో పెద్ద పిల్లవాడి ప్రజ్ఞాన్ (8)ని తన చున్నీతో కాలు కట్టుకొని చిన్నపిల్లవాడి మహన్ (5) ఎత్తుకొని పట్టణ శివారులో ఉన్న దామరచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్‌లో మృతురాలి స్వగృహం దమ్మపేట మండలం మందలపల్లి‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై రాము, భర్త ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News