హైదరాబాద్‌లో స్తంభించిన ట్రాఫిక్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు

హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా అకాల వర్షం దంచికొడుతోంది. ఓ వైపు ఎండలు మండుతున్న వేళ అనూహ్యంగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Update: 2024-05-07 13:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా అకాల వర్షం దంచికొడుతోంది. ఓ వైపు ఎండలు మండుతున్న వేళ అనూహ్యంగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అక్కడక్కడ విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. నగరంలోని రహదారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. సాయంత్రం విధులు ముగించుకుకొని అంతా ఒకేసారి రోడ్లమీదకు రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిమిషాల తరబడి ఆగిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్, హైటెక్‌సిటీలో గంటల తరబడి వాహనాలు ఉన్నచోటే ఆగిపోయాయి. మండువేసవిలో రికార్డు స్థాయి వర్షంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెం.మీ వర్షం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News