దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని టీపీసీసీ సీనియర్ఉపాధ్యక్షుడు నిరంజన్పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాలతోనే ముఖ్య లీడర్లంతా పాదయాత్రలు మొదలు పెట్టారన్నారు. పార్టీ అందరికీ ప్రయారిటీ ఇస్తుందని, ఎవరి మధ్య వ్యక్తిగత విద్వేషాలు లేవన్నారు. సమిష్టి కృషితో పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉండాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్పార్టీ తోనే మాత్రమే సాధ్యం అవుతుందన్నారు.
రేవంత్ పాదయాత్రతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్పార్టీ బలోపేతం కాగా, మహేశ్వర్రెడ్డి, భట్టి పాదయాత్రతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వయా ఖమ్మం, వరంగల్ లోనూ పార్టీ బలోపేతం కానున్నదని చెప్పారు. పీపుల్స్మార్చ్తో భట్టి విక్రమార్క పాదయాత్ర షురూ అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్యాత్రలకు భారీగా స్పందన వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురు వేస్తామన్నారు.