పార్టీ ఇన్‌చార్జీలపై టీపీసీసీ స్పెషల్ ఫోకస్.. యాక్టివ్ కావాలంటూ ఆల్టిమేటం

నియోజకవర్గ ఇన్‌చార్జీలు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ ఆదేశించింది.

Update: 2024-10-16 03:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నియోజకవర్గ ఇన్‌చార్జీలు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ ఆదేశించింది. మెజార్టీ నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జిలు పార్టీపై ఫోకస్ పెట్టడం లేదని టీపీసీసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ పార్టీ కూడా ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలని వివరించింది. ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యకలాపాలు అవసరమేనని స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణలోని ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పీసీసీ, త్వరలో నియోజకవర్గాల ఇన్‌చార్జిల పనితీరుపై ఫోకస్ పెంచుతామని వివరించింది. ఇన్‌చార్జి ఫెర్ఫార్మెన్స్‌పై ఛార్ట్ రిలీజ్ చేస్తామన్నారు. ఇక ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాల్సిందేనని టీపీసీసీ నొక్కిచెప్పింది. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ కోసం వర్క్ చేయాలన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్య గ్యాప్ వస్తుందని, అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని వెల్లడించారు. పార్టీ ఆదేశాలను బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని టీపీసీసీ ఆదేశించింది.


Similar News