వాళ్లకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలి.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ డిమాండ్
ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ హామీలు ఇస్తూ ఆ తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ హామీలు ఇస్తూ ఆ తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరదలు వస్తే పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు కూడా వరదలతో నష్టపోయిన వారికి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ ఇంకా తన పుట్టిన రోజు వేడుకల నుంచి బయటకు రాలేదని, వర్షాకాలంలో కనీస ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రేపు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించి ప్రజా సమస్యలపై కమిషనర్ కు మెమోరాండం ఇస్తామని తెలిపారు.