తెలంగాణ మోడల్ అంటే ఇదేనా?.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
స్ట్రెచర్ లేకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ పేషెంట్ ను అతడి బంధువులు కాళ్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు.
దిశ, వెబ్ డెస్క్: స్ట్రెచర్ లేకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ పేషెంట్ ను అతడి బంధువులు కాళ్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమికి అద్దంగా నిలిచింది. కాగా ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘దారుణం! ఇదేనా కేసీఆర్ చెబుతోన్న తెలంగాణ మోడల్ ? ఇదేనా దేశానికి ఆదర్శమైన మోడల్ ?’’ అంటూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు లేకపోవడంతో రోగిని ఇలా ఈడ్చుకువెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు అరాచక పాలనకు ఫలితం ఈ ఘటన అని రేవంత్ అన్నారు. కాగా ఈ ఘటనపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేక ప్రజలు బాధపడుతుంటే కేసీఆర్, కేటీఆర్ మాత్రం రాజకీయ సమావేశాలతో బిజీగా ఉన్నారని విమర్శించారు.
🔥దారుణం! ఇదేనా కేసీఆర్ చెబుతోన్న తెలంగాణ మోడల్ ?
— Revanth Reddy (@revanth_anumula) April 15, 2023
🔥ఇదేనా దేశానికి ఆదర్శమైన మోడల్ ?
నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు లేక రోగిని ఇలా ఈడ్చుకువెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ కాదా!?
సర్కారు అరాచక పాలన ఫలితం.#ByeByeKCR #KCRFailedTelangana pic.twitter.com/lDceixOYYV