చండూరు ఘటనపై రేవంత్ సీరియస్.. పోలీసులకు డెడ్‌లైన్
మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కాంగ్రెస్ కార్యాలయంలో రూ.5 లక్షల విలువైన ప్రచార సామాగ్రి దగ్ధమైన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘటుగా రియాక్ట్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల కాంగ్రెస్ కార్యాలయంలో రూ.5 లక్షల విలువైన ప్రచార సామాగ్రి దగ్ధమైన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘటుగా రియాక్ట్ అయ్యారు. చండూరు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన రేవంత్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వస్తోన్న ప్రజాధారణను చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులకు డెడ్‌లైన్ విధించారు. లేదంటే నల్లగొండ ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి : మునుగోడులో అనూహ్య పరిణామం.. షాక్‌లో కాంగ్రెస్ నేతలు