బిగ్ న్యూస్: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా తెరపైకి కొత్త ''నినాదం''!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ కోసం కోట్లాడినం అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు ఏకంగా రెండు సార్లు అధికారం
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ కోసం కోట్లాడినం అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు ఏకంగా రెండు సార్లు అధికారం ఇచ్చినప్పుడు.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకీ కనీసం ఒక అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ ప్రజలను ప్రాదేయపడుతున్నారు. ''ఒక్క ఛాన్స్ప్లీజ్'' అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలు నిర్వహిస్తున్న ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రేవంత్ ఈ దాన్ని వాడుతున్నారు. "తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా? పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన ద్రోహమా? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించరు?140 కోట్ల మంది ప్రజల ముందు తెలంగాణ సమాజం దోషిగా నిలబడింది.
1200 యువకుల బలిదానాలకు చలించి ఏ అమ్మకు కడుపు కోత ఉండకూడదని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోయినా సోనియా గాంధీ తెలంగాణకు కలను సాకారం చేశారు. అంతగొప్ప త్యాగం చేసే సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా?" అంటూ రేవంత్ప్రజలను ప్రశ్నిస్తున్నారు. పాదయాత్ర జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సెంటిమెంట్‌ను క్రియేట్ చేస్తూ రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. వీలైనంత వరకు ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌పార్టీ గెలుపు కోసం చేసే ప్రయత్నాలు ఏ మేరకు? సక్సెస్అవుతాయనేది త్వరలో తేలనున్నది.
ఎమ్మెల్యేలపై ఫైర్..
రేవంత్తిరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ఎమ్మెల్యేలపై తన దైన శైలీలో ఫైర్అవుతున్నారు. ఆయా ప్రాంతాల చరిత్రలను చెబుతూనే, ప్రస్తుతం ఎమ్మెల్యేల అరాచకాలపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల ఏకంగా ఛార్జ్ షీట్లను రిలీజ్ చేస్తున్నారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలను డ్యామేజ్చేసేలా స్పీచ్‌లు ఇస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలి? అనే అంశంపై కూడా రేవంత్తన పాదయాత్రలో క్లారిటీ ఇస్తున్నారు. వైస్సార్ సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ధరణి రద్దు, ఇళ్లు కొరకు ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆరోగ్య లిమిట్‌ను పెంపు, రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్, జర్నలిస్టులకు ఇళ్లు, స్థలాలు ఇవ్వడం, ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్, తదితర కొత్త విధానాలను కూడా ప్రకటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలకు ఆకట్టుకునేలా రేవంత్ ప్రత్యేక వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని, ప్రజలకు కాస్త సహకరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం ఖాయమని రేవంత్తన పాదయాత్రలో పదే పదే చెప్పడం విశేషం.