అలా జరిగితే రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డి
పీసీసీ ప్రెసిడెంట్ పదవి వదులుకుంటే కాంగ్రెస్ బలపడతుందనుకుంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని రేవంత్ ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవి వదులుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడతుందనుకుంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు. టీపీసీసీ ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాణిక్కం ఠాగూర్ ప్రకటించిన కొన్ని గంటలకే రేవంత్ తన రాజీనామా గురించి మాట్లాడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీపీసీసీలో నెలకొన్న గొడవలపై తాజాగా రేవంత్ స్పందించారు. సీనియర్ల సలహాలతో అందరిని కలుపుకొని పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నానని అన్నారు. పార్టీ వ్యవహారాల విషయంలో జానా, భట్టి, యాష్కీ, సంపత్ వంటి సీనియర్ల సూచనలను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొర్లుతాయని, అందరూ మానవమాత్రులేనని చెప్పారు. పార్టీలో చిన్న గొడవలు కామన్ అని, అందరం సర్దుకుపోవాలని కోరారు.