Mahesh Kumar Goud : బండి సంజయ్ కి సవాల్ విసిరిన మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కి సవాల్ విసిరారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కి సవాల్ విసిరారు. బీసీల బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టే దమ్ముందా బీజేపీకి అంటూ ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో కులగణన(Cast Cuensus)పై బీజేపీ, బీఆర్ఎస్ ఏదోక వివాదం సృష్టించాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రీసర్వే పూర్తయ్యాక మార్చిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(42% BC Reservations Bill) బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఈ బిల్లును కేంద్రరానికి పంపిస్తామని.. ఎలాగైనా సరే పార్లమెంటు(Parliament)లో బిల్లుకు ఆమోదముద్ర పడేలా చూస్తామని తెలియ జేశారు. ఈ బిల్లు గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ సహ పలువురు బీజేపీ నేతలు దమ్ముంటే ప్రధాని మోడీ(PM Modi)ని ఒప్పించి ఈ బిల్లును 9వ షెడ్యూల్(9th Schedule) లో పెట్టండి అంటూ సవాల్ విసిరారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా మీరు మోడీతో మాట్లాడగలరా అంటూ నిలదీశారు. దేశవ్యాప్త కులగణన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం, మతం అంశం నెత్తికి ఎత్తుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల్లో ఐక్యం లోపించిందనీ.. బీసీల రిజర్వేషన్ల బిల్లుపై బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.