తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మేడిపల్లి పోలీసులు హయత్ నగర్ మునగనూరులోని మెజిస్టేట్ ముందు తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురుని హాజరుపర్చారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మల్లన్నతో పాటు మిగతా నలుగురిని చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. అంతకుముందు కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు విడుదల చేశారు. మల్లన్నపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 7 ఐపీసీ సెక్షన్ల (148, 307, 342,506, 384, 109,r/w 149) కింద కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా మల్లన్నపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సాయి కిరణ్ గౌడ్ అనే వ్యక్తిని అటెంప్ట్ టు మర్డర్ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. మల్లన్నతో పాటు సుదర్శన్, పరమేష్, రవీందర్, ప్రవీణ్ నలుగురిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించగా రావనకల్ సాయి కిరణ్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై ఈ కేసులు ఫైల్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Read More: తీన్మార్ మల్లన్నపై అటెంప్ట్ టు మర్డర్ కేసు!