ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Update: 2024-08-06 15:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆసిఫాబాద్ మండలం గుండి, గోవిందాపూర్ గ్రామాల సమీపంలోని వ్యవసాయ భూముల్లో పులి అడుగులు కనిపించడంతో భయపడిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్, బీట్ అధికారులతో కలిసి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. పులి ఎటు వైపు వెళ్ళి ఉంటుందో అని పరిశీలించిన అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండమని, పశువులను అటవీ సమీపంలోకి మేతకు తోలుకు పోవద్దని హెచ్చరించారు. గత ఏడాది కూడా ఆసిఫాబాద్ పరిసర గ్రామాల్లో పెద్దపులులు సంచరించడం, పలువురిపై దాడి చేయడం ఘటనలు జరగగా.. తమ పశువులను చంపేశాయనే కోపంలో కొంతమంది విషాహారం పెట్టి పులులను చంపడం జిల్లాలో సంచలనం సృష్టించింది. 


Similar News