TSPSC పేపర్ లీకేజీ కేస్.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్
టీఎస్పీఎస్సీ కేసులో సిట్అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ కేసులో సిట్అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ముప్పయికి చేరింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అనుకున్నంత వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టుగా అనిపించటం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి సిట్అధికారులు దూకుడును పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌తో పాటు డాక్యానాయక్, రాజేశ్వర్నాయక్తదితరులకు సంబంధించిన బ్యాంక్అకౌంట్లను మరింత నిశితంగా విశ్లేషిస్తున్నారు.
లభించిన వివరాలు ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రవీణ్కుమార్నుంచి ఏఈఈ సివిల్, జనరల్స్టడీస్పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కొన్న క్రాంతి, శశిధర్‌రెడ్డి, రవితేజలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మూడేసి లక్షల రూపాయలు ఇచ్చి ప్రవీణ్కుమార్నుంచి ప్రశ్నాపత్రాలు కొన్నట్టు సమాచారం. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండుకు తరలించారు.