Telangana కేబినెట్ భేటీకి ముగ్గురు మంత్రులు డుమ్మా? కారణాలేంటి?
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి
దిశ, డైనమిక్ బ్యూరో: మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ ఈ భేటీకి హాజరుకానట్లుగా తెలుస్తోంది.
మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. హోంమంత్రి తిరువనంతపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ త్ షా నేతృత్వంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు హాజరు కాబోతున్నారు. వేముల ప్రశాంత్ ఔట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల ఈ సమావేశానికి హాజరు అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. కాగా ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అవలంభిస్తున్న వివక్ష పూరిత వైఖరిపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో కేంద్రం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని కేసీఆర్ గత కొంత కాలంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలోని బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది.
Also Read : కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా?