కేసీఆర్ సర్కార్ గొప్ప విజయం ఇదే.. ఓ నెటిజన్ ట్వీట్‌కు కేటీఆర్ కామెంట్స్
రైతు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రైతు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు మరణాలు తగ్గాయనిపై అరవింద్ వారియర్ అనే నెటిజన్ 2015 నుంచి 2022 వరకు లెక్కలు చూపిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తాజాగా కేటీఆర్ స్పందించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతు బంధు అమలు చేశామన్నారు. ఫార్మర్ ఫస్ట్ అనేది కేవలం నినాదం కాదని, దీనికి కొన్ని విప్లవాత్మక విధానాలు మద్దతుగా నిలిచాయని తెలిపారు.
70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు అకౌంట్లో వేశామని వెల్లడించారు. ప్రతి రైతుకు రైతు బీమా పేరుతో రూ.5 లక్షల జీవిత బీమా కల్పించామన్నారు. రూ.25 వేల కోట్లతో రుణమాఫీ అమలు చేశామని స్పష్టంచేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరించామని, కాళేశ్వరం, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని వెల్లడించారు. కాగా, ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.