Rain Alert : ఆ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్
తెలంగాణ(Telangana)లో పలు జిల్లాల్లో వడగళ్ల(Hailstroms)తో కూడిన భారీ వర్షం పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పలు జిల్లాల్లో వడగళ్ల(Hailstroms)తో కూడిన భారీ వర్షం పడుతోంది. జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు(Thunders), వడగళ్ళతో కూడిన వర్షం కురిసింది. అయితే తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మిర్యాలగూడలో ఆదివారం అర్థరాత్రి వరకు వడగళ్ళతో కూడిన భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చకరికలు జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో, హైదరాబాద్ లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవగా.. రాత్రి నుంచి వాతావరణం పొడిగా మారనుందని అధికారులు తెలియజేశారు. మరో రెండు రోజులూ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే కొనసాగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.