సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన తొలి ట్వీట్ ఇదే..!
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లు తెలంగాణలో సురక్ష పాలనను అందించాలని, మీ హయంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది నిమిషాల్లోనే ట్విట్టర్లో ఆయనకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓ యువకుడు మొదటి ట్వీట్ చేస్తూ నా మొదటి ఓటు మీకు వేశానని.. మీరు గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు.
హరి చింటూ అనే యువకుడు ట్వీట్ చేస్తూ.. ‘‘నాకు ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఓటు వచ్చింది. వచ్చిన తరువాత నేను ఫస్ట్ ఓటు ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసి మా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలం గెలిపించుకున్నాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ మా పేద ప్రజలకు మంచి చేయాలి. మన తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి’’ అంటూ రాసుకొచ్చారు.
‘‘చాలా సంతోషం ప్రగతి భవన్ గేట్స్ కంచె తీసేస్తునందుకు. ఇంకా రోడ్ డివైడర్ వైపుల కూడా తీయించండి. ప్రజాలకి స్వేచ్ఛ కలిపించండి. ప్రజలని కలిసేలా నిర్వహించండి. మీడియా అందరిని ప్రగతి భవన్లోకి ఆహ్వానించండి. ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా వుండెనో.. అలా పెట్టండి. స్వేచ్ఛ కలిపించండి.’’ అంటూ ట్వీట్ చేశాడు.