తెల్లరేషన్ కార్డుపై సన్నబియ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్

తెలంగాణ సర్కార్ పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-22 14:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుండి తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీ చేపడుతున్నట్టు, ఇందుకు సంబంధించిన విధి , విధానాలను తయారు చేయాలని.. వీలైనంత త్వరగా వారిని భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలు తిండి కోసం ఎన్నో కష్టాలు పడతారని, వారు కూడా అందరితో పాటు సన్నబియ్యం తినాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే ఊరుకునేది లేదని అన్నారు. కొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. అన్ని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో నాణ్యత పాటించాలని అన్నారు. 


Similar News