గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే: తెలంగాణ పోలీసు కీలక హెచ్చరిక

గణేష్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని తెలంగాణ పోలీసు హెచ్చరిక జారీ చేసింది.

Update: 2024-08-28 14:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిందువుల అతిముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. పార్వతి, పరమేశ్వరుల ముద్దుల కొడుకు గణేశుని పుట్టినరోజునే తెలుగు ప్రజలంతా వినాయక చవితిగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం నాడు చవితి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అయితే పంచాంగం ప్రకారం ఈ ఏడాది బొజ్జ గణపయ్య సెలబ్రేషన్స్‌ను సెప్టెంబరు 7 వ తేదీన ప్రారంభించనున్నారు. అలాగే గణేష్ చతుర్థి నాడు ఉపవాసం ఉండటం వల్ల మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చవితి ఘడియలు ఉన్న 6 వ తేదీ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 7 వ తారీకు మధ్యాహ్నం లోపు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించుకోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని తెలంగాణ పోలీసు హెచ్చరిక జారీ చేసింది. చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారుల అనుమతి తీసుకుని గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేలా నిర్వహకులు ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించింది.

గణేష్ మండపాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* ట్రాఫిక్‌క అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు పెట్టొద్దు

* హారతి, లైటింగ్ ల్యాంప్స్, విద్యుత్ ఉపకరణాల కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.

* విద్యుత్ ట్రాన్ఫార్మర్ల వద్ద మండపాలు ఏర్పాటు అంత శ్రేయస్కారం కాదు.

* రాత్రి వేళల్లో మండపాల వద్ద పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్, డిజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.

*పెద్ద మండపాల ఏర్పాటు గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం మంచింది.


Similar News