తెలంగాణలో టీఆరెస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసింది! కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ లేనే లేదని.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ లేనే లేదని.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు మహా ధర్నా చేపట్టారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ఈడీ ఆఫీస్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు , పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులూ పాల్గొన్నారు. తదనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.."అదానీ మెగా కుంభకోణం పై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వెయ్యాలని, దీనికి ముందే సెబీ ఛైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దోషులు తప్పించుకునే వీలున్నందున, వారికి వెంటనే శిక్షను విధించాలనే తాము ఈ ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. మోదీ బ్లాక్ మనీ తెస్తానని, పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పి, ఇప్పుడు 15 పైసలు కూడా వేయలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.