‘ఆ భయం అవసరం లేదు’.. నెటిజన్ ప్రశ్నకు సీవీ ఆనంద్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఏసీబీ డీజీ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ సీవీ ఆనంద్ మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో:సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఏసీబీ డీజీ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ సీవీ ఆనంద్ మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం ఆసక్తిగా మారింది. సీవీ అనంద్ ఏసీబీ డీజీగా పని బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వ ఉద్యోగులలోని లంచగొండిలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పలువురు లంచావతారులను ట్రాప్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా మాదాపూర్ ఎస్ఐ ఎం.రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనికి విషయంలో ట్విట్టర్ లో ఆసక్తికర చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కంచే చేను మేసిన చందంగా సామాన్యులు వంచనకు గురి అవుతున్నారు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఏసీబీ దాడులు చేస్తున్నా భయం లేకుండా పోయిందని ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిన వారిపై కక్ష పెట్టుకుంటే ఎలా? ఈ భయంతోనే చాల మంది లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదంటూ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన ఆనంద్.. ఆ భయం అవసరం లేదు. ఫిర్యాదుదారుల పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితితుల్లో పట్టుబడిన ఆఫీసర్లు కానీ వారి మనుషులు కానీ ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చేస్తే అది ఇంకా సీరియస్ కేసుకు దారి తీస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఇలా జరగలేదని బదులిచ్చారు. దీంతో మీరు ఇచ్చిన ఈ మెసేజ్ ప్రజలకు చాలా పెద్ద భరోసా సర్.. ఎంతో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. దీంతో ఏ పనైనా న్యాయంగా చెయ్యాల్సి వచ్చినపుడు ఎవరైనా లంచం అడిగితే లంచం " ఇవ్వను, ఇవ్వము " అని ప్రజలు చెప్పగలుగుతారు. ప్రజలకు మంచి చేస్తున్న మీ శాఖకు, మీకూ ధన్యవాదములు అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
Aa bhayamu avasaramu ledu - revenge , retaliation etc cheyyadaniki etti paristitullo pattubadina officer kaani vaari manushulu kani dhairyam cheyyaru endukante adi inka serious cases ki daari teestundi
— CV Anand IPS (@CVAnandIPS) April 6, 2024
and ee corruption case kuda inka serious aipotundi . Ippati varaku history lo…