గొర్రెల హాస్టల్స్‌కు లెక్కలు లేవట..!

గొర్రెల కాపరుల ఆర్థికాభివృద్ధి, గ్రామాల్లో పారిశుధ్యం పెంపొందించాలన్న లక్ష్యంతో సిద్దిపేట జిల్లాలో ఎనిమిది గొర్రెల హాస్టళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Update: 2023-04-14 04:06 GMT

గొర్రెల హాస్టల్స్ నిర్వహణకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు అధికారుల వద్ద లేవట. గొర్రెల హాస్టల్ నిర్వహణ లెక్కలు అధికారుల వద్ద ఎందుకు ఉండవని అనుకుంటున్నారా..? అయితే ఆర్టీఐ కింద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన సమాధానం చూస్తే నిజమే అని తెలుస్తోంది. గొర్రెల కాపరులకు ఆర్థికాభివృద్ధి, గ్రామాల్లో పారిశుధ్యం పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు కు వచ్చిన ఆలోచనతో గొర్రెల హాస్టల్ కు సిద్దిపేట జిల్లాలో అంకురార్పణ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధీ హామీ పథకాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రత్యేక అభివృద్ధి నిధులతో జిల్లాలో 8 హాస్టళ్లను అధికారులు నిర్మించారు. ఒక్కో హాస్టల్ లో 8 నుంచి 45 వరకు గొర్రెల షెడ్ లు ఉన్నాయి. ఒక్కో షెడ్ లో గరిష్టంగా వంద గొర్రెలు ఉండేలా అధికారులు వసతులు ఏర్పాటు చేశారు. అయితే వీటి నిర్వహణ ఖర్చులపై అడిగిన ప్రశ్నకు అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం గమనార్హం.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గొర్రెల కాపరుల ఆర్థికాభివృద్ధి, గ్రామాల్లో పారిశుధ్యం పెంపొందించాలన్న లక్ష్యంతో సిద్దిపేట జిల్లాలో ఎనిమిది గొర్రెల హాస్టళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే హాస్టల్​ నిర్వహణ లెక్కలు తమ వద్ద లేవంటూ సంబంధిత శాఖ అధికారులు సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. సమాచార హక్కు చట్టం కింద యూత్​ ఫర్​ యాంటీ కరప్షన్​ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా జవాబు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏర్పాటు చేసిన ఒక్కో హాస్టల్​ లో 8 నుంచి 45 వరకు గొర్రెల షెడ్ లు ఉన్నాయి. ఒక్కో షెడ్ లో గరిష్టంగా వంద గొర్రెలు ఉండేలా అధికారులు వసతులు ఏర్పాటు చేశారు. గొర్రెల షెడ్ ల చుట్టూ గొర్రెలు బయటకి పోకుండా బయట ఉండే కుక్కలు, తోడేళ్ల నుంచి గొర్రెల రక్షణ నిమిత్తం ప్రహారీని అధికారులు నిర్మించారు. ప్రతి షెడ్ కు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించారు. గొర్రెల హాస్టల్ లో ఉండి గొర్రెలను రాత్రి వేళలో పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ప్రత్యేక విశ్రాంతి గదిని నిర్మించారు.

* ఎనిమిది గొర్రెల హాస్టల్స్ లో.. 9,613 జీవాలు...

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఎనిమిది గొర్రెల హాస్టల్స్ లో 9,613 జీవాలు ఉన్నాయి. సిద్దిపేట అర్బన్ మిట్టపల్లిలోని గొర్రెల హస్టల్స్ లో 2150 గొర్రెలు, సిద్దిపేట రూరల్ ఇర్కోడ్ లో 3460 గొర్రెలు, నారాయణపేట మండలం జక్కాపూర్ లో 1608, ఇబ్రహీంపూరులో 1232 గొర్రెలు ఉన్నాయి. నంగునూరు మండలం ఆరెపల్లిలో 1832, అదే మండలం నర్మెట్టలో 850, గట్లమల్యాలలో 3071 గొర్రెలు ఉన్నాయి. చిన్నకోడూరు మండలం గంగాపూరులో 563 గొర్రెలు ఉన్నాయని అధికారుల సమాచారం ఇచ్చారు. అయితే గొర్రెల హస్టల్స్ నిర్వహణ కోసం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఖర్చు చేయడం లేదని సంబంధిత శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు.

* ఫిర్యాదు చేస్తాం...

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సిద్దిపేట జిల్లాలో 8 గొర్రెల హస్టల్స్ నిర్వహిస్తున్న క్రమంలో వాటి నిర్వహణ, ఖర్చుల సమాచారం లేదని అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఈ విషయమై తదుపరి ఫిర్యాదు చేస్తాం.

Tags:    

Similar News