తెలంగాణలో ‘రైట్ టూ రికాల్’ బిల్లు.. స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనానికి తెరలేపిన తీన్మార్ మల్లన్న (వీడియో)

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనానికి తెరలేపారు.

Update: 2024-06-23 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనానికి తెరలేపారు. ‘దిశ’ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన సెన్సేషనల్ విషయాలు బయటపెట్టారు. శాసన మండలిలో ‘‘రైట్ టూ రికాల్’’ అనే ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఫర్ఫామెన్స్ సరిగ్గా లేకపోతే వాళ్లను ఐదేళ్ల కంటే ముందే గద్దె దించే హక్కు ప్రజలకు ఉండాలనదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో రైట్ టూ రికాల్‌ను ఇంప్లిమెంట్ చేయాలని మండలిలో ప్రైవేట్ బిల్లు పెట్టబోతున్నట్లు బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రైట్ టూ రికాల్ బిల్లుకు వ్యతిరేకం కాదని.. కొన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో ఇప్పటికే ఈ విధానాన్ని కాంగ్రెస్ అమలు చేసిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి ఈ బిల్లును ప్రవేశ పెడతానని పేర్కొన్నారు. రైట్ టూ రికాల్ బిల్లు అనేది చాలా అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, రైట్ టూ రికాల్ బిల్లు ప్రవేశ పెడతానన్న మల్లన్న కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ బిల్లుపై వివిధ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్లన్న చెప్పిన సంచలన విషయాలను కింద ఇచ్చిన వీడియోలో పూర్తిగా చూడొచ్చు. 

Full View

Similar News