మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు గొప్పలు చెప్పుకోదగ్గ విజయం కాదు : రోజగోపాల్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ బలపడుతుందని టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2022-11-28 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో బీజేపీ బలపడుతుందని టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది నేను ముందు నుంచి చెబుతూ వస్తున్నదేనన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు గొప్పలు చెప్పుకోదగ్గ విజయం కాదని... అది తండ్రి కొడుకులిద్దరికీ తెలుసునంటూ విమర్శించారు. వారు కేవలం అధికారాన్ని ఉపయోగించుకున్నారని.. అంతేకాకుండా ప్రచారాన్ని ఆపమని మమ్మల్ని బెదిరించారని ఆరోపించారు. ఆ విధంగా వారు గెలిచారని విమర్శించారు. ఇప్పుడు వారి నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారంటూ రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు.

కాగా, ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీలు ఎం.ఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉన్న మాట నిజమే అయినా బీజేపీ బలం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఈజీగా గెలిచామని.. అసలు ఛాలెంజ్ వచ్చే ఎన్నికల్లో ఎదురుకాబోతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టఫ్ ఫైట్ తప్పదని అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓడిపోతున్నామని, చేసిన పనులను కూడా ప్రజలకు సరిగా చెప్పలేకపోతున్నామని వాపోయారు. దీంతో, టీఆర్ఎస్ నేతలు చేసిన చర్చనీయాంశంగా మారాయి. 

Tags:    

Similar News