వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్ క్లియర్ చేశారా?
మరో 48 గంటల్లో వాహనాలకు సంబంధించిన చలాన్ల డిస్కౌంట్ఆఫర్ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు చలాన్లు చెల్లించని వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మరో 48 గంటల్లో వాహనాలకు సంబంధించిన చలాన్ల డిస్కౌంట్ఆఫర్ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు చలాన్లు చెల్లించని వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇక ముందు చలాన్ల చెల్లింపునకు సంబంధించిన గడువు పెంపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్చేయటానికి భారీ డిస్కౌంట్ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్27వ తేదీన ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట పదిహేను రోజులపాటు గడువు ఇచ్చారు. ఆ సమయానికి రాష్ర్టం మొత్తం మీద 3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, డిస్కౌంట్ఆఫర్ప్రకటించిన తరువాత వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎక్కువై చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్లు క్రాష్కూడా అయ్యాయి.
ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు చలాన్ల చెల్లింపు గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. ట్రాఫిక్పోలీస్ఈ చలాన్విభాగం ఇన్ఛార్జ్సీఐ అనిల్‌తో మాట్లాడగా ఈనెల 28వ తేదీ రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్అయినట్టు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు రూ.136 కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. హైదరాబాద్కమిషనరేట్పరిధిలో 34.50 కోట్లు, సైబరాబాద్కమిషనరేట్పరిధిలో 25.25కోట్లు, రాచకొండ కమిషనరేట్పరిధిలో 16 కోట్ల రూపాయలు వసూలైనట్టుగా వివరించారు. మొత్తం ఎన్ని చలాన్లు క్లియర్అయ్యాయి? ఎంత మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరింది? అన్న పూర్తి వివరాలు వచ్చనెల 2వ తేదీన వెల్లడి కావచ్చన్నారు. కాగా, గత ప్రభుత్వం 75 శాతం డిస్కౌంట్‌తో ఆఫర్‌ను ప్రకటించినపుడు అప్పట్లో పెండింగ్‌లో ఉన్న చలాన్లలో 65 శాతం క్లియర్అయ్యాయి. ఈ క్రమంలో 300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి.