సంప్రదాయాలను పక్కనపెట్టిన తెలంగాణ సర్కారు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సర్కారు సంప్రదాయాలను పక్కనపెట్టింది.

Update: 2023-01-26 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకులు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేవారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014 ఆగస్టు 15 నుంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌ను గోల్కొండ కోటకు మార్చారు. ఖాళీ స్థలం ఎక్కువ లేదని పోలీసు పరేడ్‌ను పక్కనపెట్టేశారు. కోటలోకి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లేటప్పుడు పోలీసులు కేవలం గౌరవ వందనానికి మాత్రమే పరిమితమయ్యారు. అంతేకాకుండా కళారూపాలన ప్రదర్శనలు సైతం ఓ తంతుగా మారిపోయింది. నిల్చున్న చోటనే కళాకారులు తమ కళలను ప్రదర్శించాల్సి వస్తున్నది. దీంతో వేడుకల్లో జోష్ రావడం లేదనే చర్చ జరుగుతున్నది. 2019 జనవరి 26 వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్‌లోనే జరిగాయి. అప్పటి వరకు అక్కడ పరేడ్ నిర్వహించారు. కానీ 2020 నుంచి ఈ వేడుకలను పబ్లిక్ గార్డెన్‌కు మార్చారు. అక్కడ కూడా స్థలాభావం పేరుతో పోలీసు పరేడ్‌ను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా పబ్లిక్ గార్డెన్‌లోనూ వేడుకలు నిర్వహించలేదు. ఈసారి కోవిడ్ హెచ్చరికలు లేకున్నా వేడుకలను రాజ్ భవన్‌కు మాత్రమే పరిమితం చేశారు.

గతంలో నెల రోజుల ముందు నుంచే రిహార్సల్స్

ఉమ్మడి రాష్ట్రంలో పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర పోలీసు భద్రతా దళాలు, ఎన్ సీసీ టీమ్స్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసు టీమ్ లు పరేడ్ నిర్వహించేవి. ఇందుకోసం సుమారు నెల రోజుల ముందు రిహార్సల్స్ చేసేవారు. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పరేడ్ గ్రౌండ్ కు వచ్చేవారు. ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసేవారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో జాతీయ భావన ఏర్పడేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సంప్రదాయాలను పక్కన పెట్టేడయంతో జాతీయ వేడుకల స్ఫూర్తిని మర్చిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read....

తెలంగాణపై BJP 'త్రినేత్ర' వ్యుహాం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..! 

Tags:    

Similar News