మంత్రి సీతక్క జరిపిన చర్చలు సఫలం

గిరిజన ఆశ్రమ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లతో మంత్రి సీతక్క శుక్రవారం సచివాలయంలో చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు సఫలమైనట్టు అధికారులు తెలిపారు.

Update: 2025-01-03 16:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన ఆశ్రమ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లతో మంత్రి సీతక్క శుక్రవారం సచివాలయంలో చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు సఫలమైనట్టు అధికారులు తెలిపారు. ప్రతినెలా ఐదో తేదీలోపు జీతాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించాలని సీతక్క వారిని కోరారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. సీఆర్టీల సేవలను పొడిగిస్తూ ఇప్పటికే సీఎం ఫైల్‌పై సంతకం చేశారని గుర్తుచేశారు.

రెండు, మూడు రోజుల్లో కంటిన్యూస్ ఆర్డర్స్ ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా సమ్మెకు దిగడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ క్రమబద్దీకరణను హైకోర్టు కొట్టివేసిందని, కోర్టు కేసును అధిగమించి ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 రోజుల్లో మరోసారి సమావేశమై సమస్యలు పరిష్కరించుకుందామని మంత్రి సీతక్క సీఆర్టీలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News