6 గ్యాంరటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం!
ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలు ఈ సారి ఎన్నికల్లో కలిసొస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది. ఆరు గ్యారంటీలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేలా ఇప్పటికే వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పార్టీ త్వరలో ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
బస్సుయాత్రకు త్వరలో తేదీలు ఖరారు కానున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి బస్సుయాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. బస్సుయాత్రతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా సమాంతరంగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమాలోచనలు చేస్తోంది. తాజాగా స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు చోటు దక్కింది. తొలి జాబితాలో 50 నుంచి 55 మంది అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది.