ఇక ఓఆర్ఆర్ఆర్ పై గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించొచ్చు
ఓఆర్ఆర్ పై ప్రయాణ వేగాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఓఆర్ఆర్ పై ప్రయాణ వేగాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్ పై ప్రస్తుతం ఉన్న గంటకి 100 కి.మీ స్పీడ్ లిమిట్ ను 120 కిలో మీటర్లకు పెంచారు. ఈ రోజు నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారని తెలిపారు. ప్రస్తుతం పెంచిన స్పీడ్ లిమిట్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని, అలాగే ఓఆర్ఆర్ పై తగు రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
The maximum speed limit on #ORR is increased to a maximum of 120 kmThe state government has taken a decision to increase the travel speed on ORR.s/ hour from the present maximum limit of 100 kms/ hour
— Arvind Kumar (@arvindkumar_ias) June 27, 2023
In the review meeting held today, minister @KTRBRS reviewed the arrangements & has instructed @HMDA_Gov to ensure all safety protocols in place pic.twitter.com/yz5Wobsoq8