KTR : కాంగ్రెస్ పాలకుల పాపం..విద్యార్థుల ఆకలి కేకలు : కేటీఆర్
గురుకులా(Gurukuls)ల్లో విద్యార్థుల ఆకలి కేక(Students' Hunger Cries)లు కాంగ్రెస్ పాలకుల(Congress Rulers) పాపమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్ : గురుకులా(Gurukuls)ల్లో విద్యార్థుల ఆకలి కేక(Students' Hunger Cries)లు కాంగ్రెస్ పాలకుల(Congress Rulers) పాపమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా విమర్శించారు. అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా ! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా ! అంటూ కేటీఆర్ మండిపడ్డారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపామని పేర్కొన్నారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా ! అని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా ! సిగ్గు సిగ్గు ఇది పాలకుల పాపం విద్యార్థులకు శాపమని కేటీఆర్ దుయ్యబట్టారు.