Khairtabad: ఈ రాత్రే మహా గణపతిని కదిలించనున్న పూజారులు

ఖైరతాబాద్(Khairtabad) మహా గణపతి నిమజ్జనం(Ganapati Immersion) మంగళవారం జరుగనుంది.

Update: 2024-09-16 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్(Khairtabad) మహా గణపతి నిమజ్జనం(Ganapati Immersion) మంగళవారం జరుగనుంది. దీంతో ఈ రాత్రే 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేసిన తర్వాత మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్‌పైకి ఎక్కిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్‌ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Police Commissioner CV Anand) పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆదివారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 2.00 కల్లా పూర్తవుతుందన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన పద్దతులు వినియోగిస్తున్నారు.



 



Similar News